అభివృద్ధి పనులను ఫారెస్ట్ శాఖ అడ్డుకోవడం తగదు : ఆదిమ గిరిజన కొలం సేవ సంఘం

by Ratna Kumari |

దిశ, ఉట్నూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదనీ ఆదివాసి కొలం సంఘ ప్రజలు కదం తొక్కారు.

అభివృద్ధి పనులను ఫారెస్ట్ శాఖ అడ్డుకోవడం తగదు : ఆదిమ గిరిజన కొలం సేవ సంఘం
X

దిశ, ఉట్నూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదనీ ఆదివాసి కొలం సంఘ ప్రజలు కదం తొక్కారు. కొలం గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ముందు వారు ధర్నా నిర్వహించారు. మండలంలోని దొంగచింత, సోనాపూర్, నాగపూర్, కొలంగూడ వంటి గ్రామాల ప్రజలు పాదయాత్రగా తుడం మోగిస్తూ ఐటీడీఏకు చేరుకున్నారు. ఈ ధర్నాకు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పలు ఆదివాసి సంఘాల నాయకులు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సందర్భంగా కొలం గిరిజన నాయకులు రాజు, గోవింద రావ్ మాట్లాడుతూ చట్టాలు రాకముందు అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, గిరిజన గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాల్లో బాగంగా ఇండ్ల నిర్మాణాలను, ఇతర అభివృద్ధి పనులు అడ్డుకోవడం సబబు కాదన్నారు. పీఎం జన్మన్ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసి, పీవీటీజీ ల అభివృద్ధికి కేంద్రం సీసీడీపీ నిధులపై ఐటీడీఏ అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను పీవీటీజీల నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్నారు. పోడుభూములు సాగు చేసుకునే ఆదిమ గిరిజన ప్రజలకు అటవీ హక్కులు కల్పించి ప్రభుత్వ పరంగా లబ్ది చేకూర్చాలని డిమాండ్ చేశారు. ఆదిమ గిరిజన కొలం సేవ సంఘం భీము, సోనేరావ్, లక్ష్మణ్, ఆయా గ్రామాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Next Story