ఆర్ఎస్ జిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీడీ కళాశాల సమీపంలోని ఆర్ఎస్ జిన్నింగ్ మిల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా

ఆర్ఎస్ జిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీడీ కళాశాల సమీపంలోని ఆర్ఎస్ జిన్నింగ్ మిల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి నిల్వ ఉన్న పత్తి కుప్పకు నిప్పు అంటుకుంది. స్థానికులు గమనించి మంటను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. కానీ అప్పటికే జిన్నింగ్ మిల్ లో సీసీఐ ద్వారా కోనుగోలు చేసి నిల్వ ఉన్న సుమారు 50 క్వింటాళ్ల పైగా పత్తి కాలిపోగా భారీ ఆస్తీనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక సీసీఐ కోనుగోలు చేపట్టిన రెండు రోజులకే అగ్ని ప్రమాదం జరగడం పై జిన్నింగ్ మిల్ భద్రత నిర్వహణ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story