- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు సేంద్రీయ ఎరువులను వాడాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
దిశ, ఉట్నూర్ : రైతులు అందరూ రసాయన ఎరువులను వాడకుండా సేంద్రీయ ఎరువులు వాడకం ద్వారా పంటలు నాణ్యత ఉండటంతో పాటు భూమి సాంద్రత

దిశ, ఉట్నూర్ : రైతులు అందరూ రసాయన ఎరువులను వాడకుండా సేంద్రీయ ఎరువులు వాడకం ద్వారా పంటలు నాణ్యత ఉండటంతో పాటు భూమి సాంద్రత పెరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ రైతు వేదికలో ఎన్ఎఫ్ఎస్ఎం ఆధ్వర్యంలో సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజల కోసం ప్రభుత్వం ఉందని.. పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, రైతులు పంటల రక్షణ కోసం, అధిక దిగుబడులకు మోతాదుకు మించి ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడడం వల్ల భూసారం కోల్పోయి నష్టపోతున్నారన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వాడకంతో భూముల సారం మరింత పెరుగుతుందన్నారు. అంతకుముందు రైతు వేదిక వద్ద కొమురం భీం జయంతి సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రమేష్, ఏఈఓలు రవీందర్, జయశ్రీ, సహకార సంఘం చైర్మన్ ఎస్పి రెడ్డి, ఆర్టిఏ జిల్లా సభ్యులు దూట రాజేశ్వర్, మాజీ సర్పంచ్ జాదవ్ జగదీశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.






