- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలి : ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ జిల్లా దహేగాం మండల కేంద్రంలో రెండు వరి కొనుగోలు కేంద్రాలను సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ జిల్లా దహేగాం మండల కేంద్రంలో రెండు వరి కొనుగోలు కేంద్రాలను సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల వారికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు బోనస్ కూడా లభిస్తుందని తెలిపారు. డబుల్ బీటీ రోడ్ నిర్మాణం వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మండలంలో అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపట్టనున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. అందులో భాగంగా, ముఖ్యమైన కల్వాడ నుండి ఒడ్డుగూడ వరకు రూ.41 కోట్ల అంచనా వ్యయంతో బ్రిడ్జిలతో సహా డబుల్ బీటీ రోడ్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డిఓ దత్తారావు, డిసీఎస్ఓ వసంత లక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి, ఏడీఓ మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, వైస్ చైర్మన్ ధనుంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు మండల వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ అధికారులు, తహశీల్దార్, ఏపీఎం పాల్గొన్నారు.






