- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4 క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు పెంచికల్పేట్ మండలం లో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయన్న పక్కా సమాచారం మేరకు బుధవారం టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.

దిశ, బెజ్జూర్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు పెంచికల్పేట్ మండలం లో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయన్న పక్కా సమాచారం మేరకు బుధవారం టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 4క్వింటళ్ళ ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టు కున్నట్లు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణ ప్రతాప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పెంచికల్పేట్ మండల శివారులో నకిలీ బీటీ పత్తి విత్తనాలు వివిధ జిల్లాల నుండి తెచ్చి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న నమ్మదగిన సమాచారం మేరకు, పెంచికల్పేట్ శివారులోని బ్రిడ్జ్ వద్ద దాడులు చేసి, రెండు వాహనాలలో నలుగురు వ్యక్తులు నకిలి పత్తి విత్తనాలు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు.
ఈ కేసులో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉషా సుబ్బారావు, కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన పలమరి సురేష్, భీమినీ మండలం దుబ్బగూడెం కు చెందిన రాచకొండ నగేష్, మంచిర్యాల జిల్లా సోమ గూడెంకు చెందిన ఇనుముల రవి వద్ద నాలుగు క్వింటాళ్లు నకిలీ బిటి విత్తనాలు పట్టుకొనిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రానా ప్రతాప్ తెలిపారు. వీటి విలువ రూ. 12 లక్షలు ఉంటుందని తెలిపారు. రెండు వాహనాలు బ్రీజా కారు ,ఎర్టిగా వాహనం సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉపయోగించినట్లు తెలిపారు. అమాయక రైతులను మోసం చేసి వారిని జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వారి కటినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ వెంట, ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్లు మధు, పి రమేష్ మహమూద్, హోంగార్డ్ శేఖర్ స్పెషల్ పార్టీ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.






