- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షెడ్యూల్డ్ కులాల యువత నుండి దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగింపు
షెడ్యూల్డ్ కులాల యువత నుండి దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 2వ తేదీ వరకు తేదీ పొడిగించారు.

దిశ, మందమర్రి: 2025-26 సంవత్సరానికి గాను షెడ్యూల్డ్ కలముల కార్యకరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఆమోదిత మొదటి విడత పథకాల కోసం అర్హత గల ఎస్.సి. యువత దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం ఈ.ఈ. చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం ఎలక్ట్రికల్ లో ఈ.వి. ద్విచక్ర వాహన లక్ష్యం 185 యూనిట్లకు గాను 608 దరఖాస్తులు, ఈ.వి. త్రిచక్ర వాహనం (సరకు/ప్రయాణికుల రవాణా) లక్ష్యం 91 యూనిట్లకు గాను 838 దరఖాస్తులు, వ్యవసాయ పథకాలలో సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగం లక్ష్యం 19 యూనిట్లకు గాను 73 దరఖాస్తులు ఆన్ లైన్ లో https://tgobmms.cgg.gov.in నమోదు కావడం జరిగిందని తెలిపారు. ఆసక్తి, అర్హత గల షెడ్యూల్డ్ కులములకు చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.






