- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలం చెల్లిన కళ్యాణలక్ష్మి చెక్కులు
బజార్‌హత్నూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

దిశ, బజార్‌హత్నూర్ : మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇటీవల మార్చి 7న బోథ్ ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అయితే, లబ్ధిదారులు ఆ చెక్కులను బ్యాంకుల్లో జమ చేయడానికి వెళ్ళగా, "కాలం చెల్లిన చెక్కులు – ఇవి అమోదయోగ్యం కావు" అంటూ బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అయోమయంలో పడ్డారు. చేసేదేమి లేక తిరిగి రెవెన్యూ అధికారులను సంప్రదించగా, వారు ఆ చెక్కులను రిటర్న్ తీసుకున్నారు.
మండలంలో మొత్తం 70 చెక్కులు పంపిణీ కాగా, అందులో 6 చెక్కులు కాలం చెల్లినవిగా ఉండటం గమనార్హం. చెక్కుల పై మార్చి 5 తేదీ ఉండగా, మార్చి 7న పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి డబ్బులు వస్తాయని ఆశతో పెళ్లికి తీసుకున్న అప్పులు తీర్చుకోవాలని భావించిన లబ్ధిదారులు ఇప్పుడు తీవ్రనిరాశకు గురయ్యారు. 20 రోజులు గడిచినా కూడా చెక్కుల తేదీలను సరిచేసి మళ్లీ ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై స్థానిక ఎంఆర్ఓ దిశ రిపోర్టర్ సంప్రదించగా, "కాలం చెల్లిన చెక్కులను ఆర్డీఓ కార్యాలయానికి పంపించి, తేదీ సరిచేసి కొత్త చెక్కులను త్వరలో అందజేస్తాము" అని తెలిపారు.






