ప్రతి ఒక్కరు ఎన్నికలకు పూర్తి సంసిద్ధ‌మై ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

by Nallavelli.Anjaneyulu |

దిశ, బోథ్ : ప్ర‌తి ఒక్క‌రూ ఎన్నిక‌ల‌కు సంసిద్ధ‌మై ఉండాల‌ని ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ సూచించారు. శుక్ర‌వారం బజార్ హత్నూర్ మండల

ప్రతి ఒక్కరు ఎన్నికలకు పూర్తి సంసిద్ధ‌మై ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, బోథ్ : ప్ర‌తి ఒక్క‌రూ ఎన్నిక‌ల‌కు సంసిద్ధ‌మై ఉండాల‌ని ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ సూచించారు. శుక్ర‌వారం బజార్ హత్నూర్ మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన అనంతరం స్టేషన్ లో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి కేసుల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డు లను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ నిర్వహణలో 5S విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామాన వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేసి, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని, ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామస్తులతో సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ క్రైమ్, డిజిటల్ ఫ్రాడ్, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వాటి వల్ల కలుగు అనర్ధాల పై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. యువత, మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు చెడు వ్యసనాల బారిన పడకుండా, చదువు పై ఉన్న ఆవశ్యకతను తెలియజేసి ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్.జీవన్ రెడ్డి, బోథ్ సీఐ ఏ. వెంకటేశ్వరరావ్ పాల్గొన్నారు.

Next Story