- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఆదిలాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు, వివిద పార్టీల నేతలు ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జిల్లలో రెండు విడతల్లో జరగనున్నాయని తెలిపారు. పార్టీల నేతలు ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రచారం కోసం జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ నుంచి, గ్రామపంచాయతీకి అయితే తహసీల్దార్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనులు చేయవద్దని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించాలన్నారు.
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లవద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్
జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలు రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లద్దని,ఎక్కువ నగదు తీసుకెళ్తే దానికి సంబంధించి ఆధారాలు వెంట ఉంచుకోవాలన్నారు. ర్యాలీలు,మైక్ సెట్ కోసం 14 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ సలోని చబ్ర, ఆర్డీఓ స్రవంతి, ఆయా శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.






