అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన..

by Kodari Anjali |

అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఇవంజాలిన అన్నారు.

అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన..
X

దిశ, మంచిర్యాల: అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఇవంజాలిన అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిజిఆర్ ఎస్ జె సి పాఠశాల, కళాశాలలో నిర్వహించిన టిబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులలో ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందన్నారు. ఇందుకోసం పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం వలన క్షయ వ్యాధిని అరికట్టవచ్చు అన్నారు. ఈ వ్యాధి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు. మద్యం, పొగాకు తీసుకునే వారికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థులతో క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సత్తయ్య, స్టాఫ్ నర్స్ సంగీత, డివిజన్ క్షయ వ్యాధి సూపర్వైజర్ శ్రీపెల్లి శశికాంత్, క్షయ వ్యాధి విజిటర్ గంగబోయిన.వెంకటేశం, సూపర్వైజర్ మల్లికా, ఏఎన్ఎంలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Next Story