అంతరించిపోతున్న చిరుధాన్యాలు.. ప్రోత్సాహ‌కం క‌రువు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఇంద్రవెల్లి : సంప్రదాయ వంటకాల్లో మనిషి ఆరోగ్యానికి కీలకమైన చిరు ధాన్యాలు పల్లెల్లో రాను రాను కను మరుగవుతున్నాయి. తాత, ముత్తాత కాలం నాటి మంచి పోషక విలువలు

అంతరించిపోతున్న చిరుధాన్యాలు.. ప్రోత్సాహ‌కం క‌రువు..!
X

దిశ, ఇంద్రవెల్లి : సంప్రదాయ వంటకాల్లో మనిషి ఆరోగ్యానికి కీలకమైన చిరు ధాన్యాలు పల్లెల్లో రాను రాను కను మరుగవుతున్నాయి. తాత, ముత్తాత కాలం నాటి మంచి పోషక విలువలు కలిగిన కొన్ని పంటలు కనిపించకుండా పోయాయి. రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి చిరు ధాన్యాలు సరైన ఆహారమని ఆహార నిపుణులు చెబుతున్నారు. మనిషి శరీరానికి అవసరమైన మంచి పోషక విలువలు ఉన్న చిరు ధాన్యాలు కొర్రలు, సామలు, అండు కొర్రలు, అరికెలు, జొన్నలు వంటివి క్రమ క్రమణ తగ్గుతూ వస్తున్నాయి. ఆధునిక జీవన శైలిలో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు చిరు ధాన్యాలు వాడకం తప్పని సరి అని ఆహారపు నిపుణులు తెలుపుతున్నారు. ఈ యుగంలో చాలా మంది రైతులు వాణిజ్య పంటల సాగు వైపు మొగ్గు చూపడంతో చిరు ధాన్యాల పంట సాగు అంతరించిపోతుంది. బాహ్య దేశాల ఆహారా రుచులకు ప్రజలు అలవాటు పడి మంచి పోషక విలువలు కలిగిన చిరు ధాన్యాలను వాడకం మర్చిపోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తాత, ముత్తాతల‌ కాలంలో పండించిన చిరు ధాన్యాల స్థానంలో వాణిజ్య పంటల సాగు పెరగడంతో చిరు ధాన్యాలు అంతరించిపోతున్నాయి. చిరు ధాన్యాలు ఆహార ప్రయోజనాలే ,బరువు తగ్గుదల,గుండె సంబంధిత వ్యాధులకి మేలు చేస్తుంది, తదితర సమస్యలకు రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుందనీ ఆహారపు నిపుణులు చెబుతున్నారు.

చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పరిష్కరించ బడుతాయి. పైత్యం, గుండె మంట కడుపు ఉబ్బరం, ఆడవారి రుతు సమస్యలు, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు ఔషద లాంటిది. కొర్రలు మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. వీటిలోయంటి ఆక్సిడెంట్లు ఆర్థికంగా ఉంటాయి. జొన్న,కొర్రలలో అధిక పీచు పదార్థం,మాంసకృత్తులు, ఐరన్, మాంగనీసు, మెగ్నీషియం, భూస్వరం, విటమిన్స్ ఉండడంతో ప్రజల ఆరోగ్యానికి మెరుగు పరచడంలో చిరు ధాన్యాలు ఎంతో కీలకమవుతున్నాయి. వాణిజ్య పంటలకు దక్కుతున్న ప్రోత్సాహకం, కనీస మద్దతు ధర చిరు ధాన్యాలకు దక్కడం లేదు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని చిరు ధాన్యాలకు కొనుగోలు కేంద్రాలతో పాటు కనీస మద్దతు ధర ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. చిరు ధాన్యాల రైతులకు చైతన్యం అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, చిరు ధాన్యాల సాగును లాభదాయకంగా మార్చడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.

Next Story