ఉద్యోగ‌వ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్

by Nallavelli.Anjaneyulu |

పోలీసు శాఖ తరపున ప్రయివేట్ కంపెనీల్లో కల్పించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగంలో స్థిరపడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

ఉద్యోగ‌వ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోవాలి :  ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్
X

దిశ, ఆదిలాబాద్ : పోలీసు శాఖ తరపున ప్రయివేట్ కంపెనీల్లో కల్పించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగంలో స్థిరపడాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్ లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలతో పాటు జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చారు. నిరుద్యోగులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంపెనీల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి అభ్యర్థులకు సీరియల్ సంబర్లను కేటాయించారు. ఆయా కంపెనీల వారు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ వివరాలు, వేతనాల గురించి తెలియజేశారు.కాగా ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో సుమారు 2 వేలకు పైగా యువతీ యువకులు ఉద్యోగాలను పొందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కే ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, ఎఎస్పి లు పి మౌనిక, రుత్విక్ సాయి కొట్టే, డిఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, ఇంద్ర వర్ధన్, పోతారం శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, కంపెనీల ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story