కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

by Ratna Kumari |

క‌రెంట్ షాక్ తో వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని గౌర‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

కరెంట్ షాక్..  వ్యక్తి మృతి
X

దిశ, ఇంద్రవెల్లి : క‌రెంట్ షాక్ తో వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని గౌర‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయ‌న్న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలంలోని దానోరా గ్రామానికి చెందిన మదినే అక్షయ్ ( 30) గ్రామ శివారు వ్యవసాయ పొలంలో గత కొన్ని రోజులుగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం పొలంలోన 11 కేవీ లైన్ కు కరెంట్ తీగలు పెట్టి కరెంటు తీసుకోవాలని ప్రయత్నించగా.. అక స్మాత్తుగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మృతునికి భార్య తో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అన్న మదినే సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

Next Story