ఆదిలాబాద్ లో ఎలక్షన్స్.. ఎస్సై పై దాడి

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలంలో గల సీతగొంది గ్రామంలో కౌంటింగ్ కేంద్రం

ఆదిలాబాద్ లో ఎలక్షన్స్.. ఎస్సై పై దాడి
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలంలో గల సీతగొంది గ్రామంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.గుమిగూడిన వారిని చెదరగొట్టే ప్రయత్నంలో ఘర్షణకు దారీ తీయడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పోలీసు బలగాలను భారీగా మొహరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పడిన ఘర్షణ తీవ్రతకు దారి తీసింది.ఇది గమనించిన అక్కడే ఉన్న ఎస్సై పురుషోత్తం వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.కానీ కొంతమంది వారు వినకపోవడంతో దాడులకు దిగారు.ఈ దాడులను చదరగొట్టే ప్రయత్నంలో ఎస్సై తలకు తీవ్ర గాయాలయ్యాయి.అంతేకాకుండా ఆందోళన కారణం రెండు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు.ఈ ఘర్షణలో గాయాల పాలైన ఎస్సైని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం స్పందించి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను గుడిహత్నూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో గల కౌంటింగ్ కేంద్రం వద్దకు పంపించారు.పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది.అనంతరం గాయాల పాలైన ఎస్సై పరిస్థితిని ఆయన సందర్శించి పరిశీలించారు.ఎస్సై కి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Next Story