- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల నిబంధనలు పాటించాలి : కలెక్టర్

దిశ, మంచిర్యాల : రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం జిల్లా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల అయినందున ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఓట్ల లెక్కింపు అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి గణపతి, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రావుఫ్ ఖాన్, డిసిపి. భాస్కర్, మాస్టర్ ట్రైనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






