క్యాతనపల్లి లో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా

by Ratna Kumari |

క్యాతనపల్లి లో మున్సిపల్ చైర్మ‌న్ ఎన్నిక మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. గెలిచిన ఇరు పార్టీల సభ్యులు నూతన ప్రమాణస్వీకారానికి హాజ‌రు కాక‌పోవ‌డంతో తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ రేపటికి వాయిదా వేశారు.

క్యాతనపల్లి లో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా
X

దిశ, రామకృష్ణాపూర్ : క్యాతనపల్లి మున్సిపల్ చైర్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక రసాభాసగా మారింది. గెలిచిన ఇరు పార్టీల సభ్యులు నూతన ప్రమాణస్వీకారానికి ఎవరు రాకపోవడంతో తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ రేపటికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్ణీత గడువు కోరం సభ్యులు ఎవరు హాజరు కాక‌పోవ‌డంతో మండల తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఇచ్చిన సమయానికి మున్సిపల్ ఎన్నికల యాక్ట్ ప్రకారం.. నూతన కౌన్సిలర్ లకు పదవీ ప్రమాణం తో పాటు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించబడుతుందని క్యాతనపల్లి మున్సిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story