అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి..

by Bhanu |

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాత గ్రామంలో వృద్ధుడి అనుమానాస్పద మృతి శుక్రవారం ఉదయం కలకలం రేపింది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి..
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాత గ్రామంలో వృద్ధుడి అనుమానాస్పద మృతి శుక్రవారం ఉదయం కలకలం రేపింది. గ్రామస్థుల సమాచారం ప్రకారం.. బలరాం గౌడ్ (70) అనే వృద్ధుడు శుభకార్యం నిమిత్తం కుటుంబ సభ్యులు ఇతర గ్రామానికి వెళ్లడంతో ఇంటిలో ఒంటరిగా ఉన్నాడు.

ఈ ఉదయం అతడు రక్తపు మరకలతో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న వారు పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి కారణాలపై విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.

Next Story