గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

by Taduka Kalyani |

గిరిజన సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య అన్నారు.

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
X

దిశ, ఉట్నూర్ : గిరిజన సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య అన్నారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులు, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఆర్డీవో మోహన్ సింగ్, ఇతర అధికారులు శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కుమ్మరుకుంట గ్రామంలో పర్యటించారు. చైర్మన్ రాకతో గిరిజనుకు సంస్కృతి, సంప్రదాయాలను బద్దంగా స్వాగతం పలికారు. ఏజెన్సీలో గిరిజనులు ఇబ్బందులు పడే సమస్యలతో పాటు ఈ గ్రామంలో తమకు శాశ్వత గృహాల అవసరం, భూమి, నివాస హక్కులు, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సమస్యలను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గిరిజనుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ , ఐటీడీఏ అధికారులు, అటవీ శాఖ, ఆరోగ్య శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, గిరిజనులు పాల్గొన్నారు.

Next Story