- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి కోసం కృషి చేయాలి : ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ
దిశ, మందమర్రి : నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి కోసం కృషి చేయాలని ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. గురువారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాల

దిశ, మందమర్రి : నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి కోసం కృషి చేయాలని ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. గురువారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాల కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ .బలరాం సారథ్యంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి, రవాణా అన్ని రంగాలలో కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నదని తెలిపారు. ప్రస్తుత పోటీ మార్కెట్ లో సింగరేణి సంస్థ కూడా తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరంతో పాటు విద్యుత్ సంస్థల పురోగతి మనం సరఫరా చేసే నాణ్యమైన బొగ్గు పైనే ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు తనవంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో సహకరించాలన్నారు. అలాగే రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సీఎంఓఐ జాయింట్ సెక్రటరీ రవి, పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్, సీనియర్ పి.ఓ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు.






