ఎదగాని దప్తారీ మొక్కజొన్నపంట..!

by Nallavelli.Anjaneyulu |

కోటి ఆశలతో రబ్బీలో పంటలను సాగు చేసి ఆర్థికంగా బలపడాలని కష్ట పడతారు.

ఎదగాని దప్తారీ మొక్కజొన్నపంట..!
X

దిశ‌, కుబీర్‌ : కోటి ఆశలతో రబ్బీలో పంటలను సాగు చేసి ఆర్థికంగా బలపడాలని కష్ట పడతారు. రైతులను ఏటా ఏదో ఒక రకం సాగుచేసి మొక్కజొన్న పంట నిలువునా ముంచుతూ వస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం డీలర్ల పై చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నిలువునా నష్టపోతున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్డి కేధార్ కుబీర్, కుబీర్, గ్రామాల్లోని పలువురు రైతులు దప్తారీ రకం మొక్కజొన్న పంటను సాగు చేశారు. పంటను ఓకే సమయానికి సాగు చేసిన నకిలీ విత్తనాల వల్ల పంట ఎదుగుదల సరిగా లేదని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత కంపెనీ వారు నష్టపోయిన రైతులకు మీ ప్రయత్నం మీరు చేయండి దిగుబడి రాకపోతే ఎకరానికి 35 క్వింటాళ్ల చొప్పున పరిహారం ఇచ్చేవిధంగా చూస్తామని నచ్చ చెప్పుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పంటకే నీళ్లు పెట్టడం ఎరువులు వేయడంలో నిర్లక్ష్యం చేయొద్దని కంపెనీ వారు సూచిస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం ఓ రైతు పయినిర్ కంపెనీ 3546 రకం మొక్కజొన్నను 7 బ్యాగులు సాగు చేశాడు. సరిగా ఎదుగుదల లేకపోవడంతో తీవ్రoగా నష్టపోయాడు.రైతుల వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ ఉపయోగం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీవారు ప్రస్తుత పరిస్థితుల నుండి బయట పడేందుకే పరిహారం నాటకం అంటూ పలువురు వాపోతున్నారు. రైతులు ఏదో రకంగా నష్టపోతున్న పరిహారము అందిన దాఖలాలు కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు రైతులకు పరిహారం అద్దెలా చూడాలని మండలం రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story