- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షరాస్యతతోనే ఆర్థికాభివృద్ధి : జిల్లా వయోజన శాఖ అధికారి పురుషోత్తం
దిశ, వేమనపల్లి : అక్షరాస్యతతోనే కుటుంబ ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్ అన్నారు

దిశ, వేమనపల్లి : అక్షరాస్యతతోనే కుటుంబ ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్ అన్నారు మండల కేంద్రంలో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఉల్లాస్ లో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో మాట్లాడుతూ వేమనపల్లి మండలంలోని ప్రతి ఒక్కరు అక్షరాస్యతను కలిగి ఉండేలా ఇంట్లో వారందరూ చదువుకొని ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని కుటుంబ పెద్దకు చదువు అవసరమని ఆర్థికంగా ఎదిగేందుకు చదువు ఎంత దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ వేలిముద్ర నుండి సంతకం పెట్టడం చిన్నచిన్న పదాలను నేర్చుకోవడం కోసమే అమ్మకు అక్షరమాల కార్యక్రమం అని అన్నారు ప్రతి గ్రామం నుండి ఇద్దరు ఓబీలు మరియు వివోఏ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి కావలసిన సామగ్రిని అందజేయడం నిరక్షరాష్యులను అక్షరాస్యులుగా మార్చడం కొరకు వాలంటరీ టీచర్స్ లను గుర్తించి ఉల్లాస్ యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు వారు గ్రామంలోని నిరక్షరాక్షలను అక్షరాస్యులుగా మార్చటం వారి బాధ్యతని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంఈఓ శ్రీధర్ రెడ్డి ఏపీఎం ప్రమోద, సెర్ప్ సిఆర్పిలు తిరుమల, అమీనా, వయోజన విద్యాశాఖ డిఆర్పీలు సుమన్ వివోఏలు, ఓబీలు పాల్గొన్నారు.






