- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వార్డెన్ సార్ మాకు వద్దు.. లేకుంటే రోడ్డు మీద ధర్నా చేస్తాం
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఐటీడీఏ పీవో కు ఫిర్యాదు చేయడంతో

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఐటీడీఏ పీవో కు ఫిర్యాదు చేయడంతో ఏటీడీఓ సుచంతన్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడి గత రెండు రోజులుగా విచారణ జరిపారు. అయితే గురువారం ఏటీడీఓ అధికారితో విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు మాట్లాడుతూ అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఫిర్యాదు చేసిన వారి మీద వార్డెన్ కక్ష గడుతున్నారని కావాలనే వాళ్లను టార్గెట్ చేస్తున్నారని అంతేకాదు.. ఈ వార్డెన్ సారు మాకు వద్దంటూ లేకుంటే రోడ్డు పై ధర్నా చేస్తామని అన్నారు. ఏటీడీఓ విద్యార్థులకు ఎంత నచ్చ జెప్పినా విద్యార్థులు వినకుండా వార్డెన్ ను వెంటనే తొలగించాలని వేరే సార్ ను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏటీడీఓ విద్యార్థులతో మాట్లాడుతూ మీ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ విషయం పై హాస్టల్ వార్డెన్ నాందేవ్ మాట్లాడుతూ విద్యార్థులను క్రమశిక్షణ లో ఉంచుదామని స్ట్రిక్ట్ గా వ్యవహారిస్తే.. లేనిపోనివి కల్పించుకుని చెబుతున్నారని నేను తప్పు చేస్తే ఏ చర్య కైనా సిద్ధమని అన్నారు. ఏటీడీవో సుచంతన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్నాయి అనడంతో భోజనాన్ని పరీక్షించామని, విద్యార్థులు వార్డెన్ పై ఆరోపిస్తున్న పలు విషయాలపై వార్డెన్ తో చర్చించామని తుది నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు.






