అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు డీఎస్పీ వహీదుద్ధీన్

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ వహీదుద్ధీన్ హెచ్చరించారు. శనివారం ఈస్గాం మండలంలోని తుంగమడుగు

అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు డీఎస్పీ వహీదుద్ధీన్
X

దిశ, ఆసిఫాబాద్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ వహీదుద్ధీన్ హెచ్చరించారు. శనివారం ఈస్గాం మండలంలోని తుంగమడుగు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో నిర్వహించిన సోదాల్లో 20 లీటర్ల గుడుంబాతో పాటు 30 కేజీల బెల్లం స్వాధీనం చేసుకోగా.. 3 వేల లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. గ్రామ ప్రజలు అసాంఘిక కార్యకలాపాలతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు లేక అవరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సహకారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ కుమార్ స్వామి, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story