- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి.. రూ.1.5 లక్షల నష్టం..
by Bhanu |
లోకేశ్వరం మండలంలోని గడ్ చాందా గ్రామంలో కుక్కల దాడితో ఓ రైతుకు భారీ నష్టం జరిగింది. గ్రామానికి చెందిన ఏరోళ్ల భోజన్నకు

X
దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండలంలోని గడ్ చాందా గ్రామంలో కుక్కల దాడితో ఓ రైతుకు భారీ నష్టం జరిగింది. గ్రామానికి చెందిన ఏరోళ్ల భోజన్నకు చెందిన గొర్రెల మందపై రాత్రివేళ కుక్కలు దాడి చేయడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. భోజన్న తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం తన గొర్రెలను మేతకు తీసుకెళ్లి, రాత్రి ఇంటికి తీసుకొచ్చి కొట్టంలో ఉంచాడు.
అయితే అర్ధరాత్రి సమయంలో జాతి కుక్కలు దాడి చేయడంతో పందొమ్మిది గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. మృత గొర్రెల విలువ దాదాపు రూ.1.5 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు.ఈ ఘటనతో తాను తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యానని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని భోజన్న వేడుకున్నారు.
Next Story






