జ‌న‌వాసాల్లో వైన్స్ లు ఏర్పాటు చేయొద్దు

by Ratna Kumari |

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో నూతన వైన్ షాప్ కోసం జనావాసాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడం పట్ల స్థానిక మహిళలు, ప్రజలు కలెక్టర్ కు, ఎక్సైజ్ శాఖ అధికారులకు

జ‌న‌వాసాల్లో వైన్స్ లు ఏర్పాటు చేయొద్దు
X

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో నూతన వైన్ షాప్ కోసం జనావాసాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడం పట్ల స్థానిక మహిళలు, ప్రజలు కలెక్టర్ కు, ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతిపత్రం అంద‌జేశారు. ఇళ్ల‌ పక్కన వైన్స్ షాప్ ఏర్పాటు చేయొద్దని శనివారం తహసీల్దార్ సుభాష్ చందర్ కు వినతి పత్రం అంద‌జేశారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం గూర్చి ఎక్సైజ్ అధికారి ని స్థానికులు అడగగా.. రూల్ ప్రకారం మేము అనుమతులు ఇస్తున్నాం. మీకేమైనా సమస్య ఉంటే ధర్నాలు , రాస్తారోకోలు చేసుకోండి అంటూ మాట్లాడటం పట్ల స్థానిక మహిళలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల పట్ల ఇలా వ్యవహరించడం ధర్నాలు చేసుకోండి అంటూ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయం పై ఎమ్మార్వో జిల్లా అధికారుల దృష్టి కి తీసుకెళ్తామని తెలిపారు. ఎలాగైనా జనావాసాల్లో వైన్స్ షాప్ ఏర్పాటు కాకుండా చూడాలని ఏర్పాటైతే మాత్రం పెద్ద ఎత్తున మహిళలతో కలిసి నిరసన తెలుపుతామని కాలనీ వాసులు హెచ్చరించారు.

Next Story