మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కారకులైన దోషుల‌ను అరెస్ట్ చేయ‌డంలో పోలీసుల నిర్ల‌క్ష్యం: జిల్లా అధ్య‌క్షుడు న‌గునూరి వెంక‌టేశ్వ‌ర్ గౌడ్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా వేమ‌న‌ప‌ల్లి మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడు ఏట మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన కాంగ్రెస్ నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌డంలో పోలీసులు నిర్ల‌క్ష్యం

మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కారకులైన దోషుల‌ను అరెస్ట్ చేయ‌డంలో పోలీసుల నిర్ల‌క్ష్యం:  జిల్లా అధ్య‌క్షుడు న‌గునూరి వెంక‌టేశ్వ‌ర్ గౌడ్
X

దిశ‌, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా వేమ‌న‌ప‌ల్లి మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడు ఏట మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన కాంగ్రెస్ నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌డంలో పోలీసులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు న‌గునూరి వెంక‌టేశ్వ‌ర్ గౌడ్ మండిప‌డ్డారు. తాజాగా చెన్నూర్ లో ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. త‌మ నాయ‌కుడి ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన వారిని ఇప్ప‌టివ‌ర‌కు అరెస్ట్ చేయ‌డం వెనుక అధికార పార్టీ నాయ‌కుల అండ‌దండ‌లున్నాయ‌ని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని హైకోర్టుకు వెళ్లి బెయిల్ కోసం పిటిషన్ వేసి స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అలాగే నీల్వాయి ఎస్సై కోటేశ్వరరావు నిందితులలో ఒక‌రు కోటేశ్వరరావు బంధువు కాబట్టే కేసును నీరుగారిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏట మధుకర్ మృతి చెంది నేటికీ ఏడు రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఇప్పటివరకు ఏ ఒక్క నిందితుడిని అరెస్టు చేయలేదని పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి రఘునాథ రావు ఆదేశాల మేరకు తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని, నిందితులను అరెస్టు చేసేంతవరకు వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రావు, కౌన్సిల్ సభ్యులు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్లు , నాయకులు శ్రీనివాస్, వెంకట నర్సయ్య, జాడి తిరుపతి ,శివ కృష్ణ, తలారి రాజు, రాజేష్, అడప శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story