గొర్రెలు, మేక‌ల‌కు ఉచిత న‌ట్ట‌ల నివార‌ణ మందులు పంపిణీ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ల‌క్ష్మ‌ణచంద : మండల కేంద్రమైన లక్ష్మణ చంద, చింత‌ల‌చంద గ్రామాలలో గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల

గొర్రెలు, మేక‌ల‌కు ఉచిత న‌ట్ట‌ల నివార‌ణ మందులు పంపిణీ
X

దిశ‌, ల‌క్ష్మ‌ణచంద : మండల కేంద్రమైన లక్ష్మణ చంద, చింత‌ల‌చంద గ్రామాలలో గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు, మొత్తం 3181 జీవాలకు తాగించారు. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచులు లక్ష్మణచంద సర్పంచ్ వోస కవిత రాజు, చింతల్ చంద వోడ్నాలా వెంకట్ ముఖ్య అతిథులుగా హాజ‌రై ప్రారంభించారు. జీవాల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉంచాల‌ని.. వారికి అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మందులు వేయాల‌ని, లేదంటే న‌ష్ట‌పోతార‌ని స‌ర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీకే శ్రీనివాస్, సంతోష్ జెవివో, విజయలక్ష్మి జేవివో, సాయి రాజేశ్వర్, శంకర్ నిర్వహించారు. గొర్రెల కాపర్లు పాల్గొన్నారు.

Next Story