- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కిల్ డెవలప్మెంట్‌లో ట్రైనింగ్ పొందిన మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ
స్కిల్ డెవలప్మెంట్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు జీఎం రాధాకృష్ణ, సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ సర్టిఫికెట్స్ అందజేశారు.

దిశ, మందమర్రి: స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అండర్ SCCL - CSR మందమర్రి ఏరియా, రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్న్షిప్(RDSDE), హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు మందమరి జీఎం ఎన్.రాధాకృష్ణ, ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు వాణి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 31 మంది మహిళా అభ్యర్థులకు కాస్మోటాలజీ కోర్సును పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సర్టిఫికెట్లను అందచేశారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు కాస్మోటాలజి కోర్సును పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,సింగరేణి సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి సూచనల మేరకు స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చే దిశగా సింగరేణి కాలరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందన్నారు.
తోటి వారి ఎదుగుదలకు సహకరించాలి..
కావున స్థానికంగా ఉండేటువంటి నిరుద్యోగ యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శ్రీవాణి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఈ కోర్సును ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని, తద్వారా ఆర్థికంగా ఎదగడానికి మార్గన్వేషణ చేయాలని అన్నారు. మందమరి ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులను నేర్చుకొని, ఆర్థికంగా ఎదగాలని మనతో పాటు మన తోటి వారి ఎదుగుదలకు సహకరించాలని వారు అన్నారు. 31 మంది అభ్యర్థులకు సరిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సి.ఎం.ఓ.ఏ.ఐ అధ్యక్షులు రమేష్, GMVTC అడిషనల్ మేనేజర్ టి.శ్రీధర్, అశోక్ కుమార్ GMVTCఅసిస్టెంట్ ట్రైనింగ్ మేనేజర్, కాస్మోటాలజీ ట్రైనర్ ప్రీతి, ఎం వి టి సి ఇన్స్ట్రక్టర్, డి.శ్రీనివాస్ పాల్గొన్నారు.






