- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఎస్పీ అభ్యర్థులకు బీ ఫామ్ ల అందజేత
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతుందని దీన్ని అడ్డుకుంటామని మంచిర్యాల బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.

దిశ, మంచిర్యాల : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతుందని దీన్ని అడ్డుకుంటామని మంచిర్యాల బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ముందుగా మంచిర్యాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి, లక్షట్ పేట పలువురు బీఎస్పీ లో చేరడంతో వారికి బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిమిషాని రామచందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీఎస్పీ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ అందజేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీల నుండి హాజరైన 27 మంది అభ్యర్థులకు దిశ నిర్దేశం చేశారు. పార్టీ విధివిధానాలపై వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బహుజనుల వ్యతిరేక పార్టీలు అని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో రద్దు చేయడానికి కుట్రలు పన్నుతుందన్నారు. ఈ కుట్రను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బీఎస్పీ లో కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొద్దున. సంధ్యారాణి రామ్మూర్తి, బిఆర్ఎస్ నుండి ఇప్ప. సురేష్, క్యాతనపల్లి నుంచి బొల్లి రమేష్, లక్షట్ పేట నుంచి రామిళ్ళ మురళి బీఎస్పీ పార్టీలో చేరారు. వారికి స్టేట్ కోఆర్డినేటర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బెల్లంపల్లి పట్టణం నుంచి బీఎస్పీ పార్టీలో పలువురు చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ ఇన్ చార్జి కాదాసీ రవీందర్, జిల్లా ఇన్ చార్జిలు నాగుల కిరణ్ బాబు, దాగాం శ్రీనివాస్ పాల్గొన్నారు.






