- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెజ్జూర్ వారాంతపు సంతలో అంబలి పంపిణీ
కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఆదివారం వారాంతపు సంతలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు.

X
దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఆదివారం వారాంతపు సంతలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ దుర్గం సరోజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎండల తీవ్రతలను దృష్టిలో ఉంచుకొని వారాంతపు సంతకు వచ్చే ప్రజలకు ఆకలిని తీర్చడానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రతి ఏడాది అంబలి పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని..దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదల దప్పిక, ఆకలి తీర్చేందుకు అంబలీ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లూరి సతీష్, కొండ్ర నరేందర్ గౌడ్, రామడుగుల రమేష్, కోట రాజన్న, జంగిటి మల్లేష్, ధూపం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story






