దిశ ఎఫెక్ట్.. రైతుపై దాడి చేసిన‌ మార్కెట్ అధికారి సస్పెండ్

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఓ అధికారి మద్యం మత్తులో రైతుపై దాడి చేయగా.. ఈ ఘటనపై దిశలో కథనం ప్రచురితమైంది. దీనికి జిల్లా అధికారులు తక్షణమే స్పందించారు.

దిశ ఎఫెక్ట్.. రైతుపై దాడి చేసిన‌ మార్కెట్ అధికారి సస్పెండ్
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఓ అధికారి మద్యం మత్తులో రైతుపై దాడి చేయగా.. ఈ ఘటనపై దిశలో కథనం ప్రచురితమైంది. దీనికి జిల్లా అధికారులు తక్షణమే స్పందించారు. ఈ మేరకు మార్కెట్ అధికారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం రాత్రి జైనథ్ కు చెందిన సంద మహేష్ అనే రైతుపై మార్కెట్ అధికారి, గుడిహత్నూర్ పీఏసీఎస్ సెక్రెటరీ కేంద్రే పండరి మద్యం సేవించి.. మద్యం మత్తులో రైతుతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు పండరిపై కేసు నమోదైంది. మరోవైపు రైతుపై దాడికి పాల్పడిన అధికారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని..విధుల్లో నుంచి తొలగించాలని.. జాగృతి నాయకులు వేణుగోపాల్ యాదవ్,టీఆర్పీ నాయకులు తాళ్ల రవీందర్, వివిధ సంఘాల నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ ఘటనపై క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కలెక్టర్ కు నివేదిక అందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మార్కెట్ అధికారి పండరితో పాటు మన్నూర్ పీఏసీఎస్ సెక్రెటరీ వెంకట్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Next Story