దిశ ఎఫెక్ట్.. డీల‌ర్ లైసెన్స్ ర‌ద్దుకు సిఫార‌సు..!

by Ratna Kumari |

కుబీర్ లో యూరియా దందా వార్తకు వ్యవసాయ శాఖ అదికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్.. డీల‌ర్ లైసెన్స్ ర‌ద్దుకు సిఫార‌సు..!
X

దిశ, కుబీర్ : కుబీర్ లో యూరియా దందా వార్తకు వ్యవసాయ శాఖ అదికారులు స్పందించారు. దిశ క‌థ‌నానికి స్పంద‌న ల‌భించింది. యూరియాను అధిక ధరకు విక్రయించిన డీలర్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి సారిక తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి జిల్లా అధికారులకు నివేదించినట్లు పేర్కొన్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ దందాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీలర్లు ఫర్టిలైజర్ యాప్ లో స్టాక్ వివరాలను నమోదు చేసేటప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. దీంతో మండల రైతులకు తెలియజేయవచ్చు అని తెలిపారు.

Next Story