దిశ ఎఫెక్ట్.. నీటి సమస్యకు చెక్..!

by Bhanu |

ముధోల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్ల సరఫరా లో అంతరాయం కలిగిందంటూ..! దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్.. నీటి సమస్యకు చెక్..!
X

దిశ, ముధోల్ : ముధోల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్ల సరఫరా లో అంతరాయం కలిగిందంటూ..! దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆదివారం మిషన్ భగీరథ ఏ.ఈ సుమన్ దగ్గరుండి మరమ్మత్తులు చేయించి నీళ్లు అంతరాయానికి చెక్ పెట్టి, ఇంటింటికి నీళ్ల సరఫరాను వచ్చే చర్యలు చేపట్టారు.


విద్యుత్ ట్రాన్స్ఫర్ సమస్యల కారణంగా గత ఐదు రోజుల నుండి ముధోల్ కేంద్రంలో భగీరథ నీళ్లు రాక ఇబ్బంది పడిన విషయం తెలిసింది..! అయితే దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించి,సమస్య తీరింది. ఈ సందర్భంగా దిశ పత్రికకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Next Story