విధుల్లో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌మ‌య పాల‌న పాటించాలి : ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్

by Nallavelli.Anjaneyulu |

దిశ, సాత్నాల : మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తి అప్రమత్తతో విధుల నిర్వహణ

విధుల్లో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌మ‌య పాల‌న పాటించాలి : ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్
X

దిశ, సాత్నాల : మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తి అప్రమత్తతో విధుల నిర్వహణ చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం జైనథ్ పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ సందర్శించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ఎస్సై పి గౌతమ్ సారథ్యంలో ఉన్న పోలీసు సిబ్బంది ద్వారా నిర్వహించిన కవాతును ఎస్పీ పరిశీలించారు. ప్రతి శనివారం పరేడ్ నిర్వహణ చేపట్టాలని, పరేడ్ వల్ల శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం లభిస్తాయి అని తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పచ్చదనంపై ప్రశంసించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి కేసుల స్థితిగతులపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి,సీఐ శ్రవణ్ కుమార్ తదితరులున్నారు.

Next Story