- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిథిలావస్థలో కల్వర్టు.. పట్టిచుకోని మున్సిపల్ సిబ్బంది
దిశ, చెన్నూర్ : మంచి ర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని 9వ వార్డులో సాయిబాబా మందిరం వద్ద ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. ఏ

దిశ, చెన్నూర్ : మంచి ర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని 9వ వార్డులో సాయిబాబా మందిరం వద్ద ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. ఏ సమయాన కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు వార్డు ప్రజలు సమస్యను వివరించగా తూతూ మంత్రంగా మరమ్మతులు చేయించి చేతులు దులుపుకున్నాడని వార్డ్ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతిరోజు సాయిబాబా, సోమేశ్వర, శివాలయాలకుభక్తులు ఈ దారి గుండానే వెళుతుంటారు. ముఖ్యంగా వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుండటంతో కల్వర్టు శిథిలావస్థకు చేరుకొని వాహనాలు వెళుతున్న సమయంలో వాహనాలు షేక్ అవుతుండటం గమనార్హం.
అసలు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆయన మున్సిపల్ సిబ్బంది నూతన కల్వర్టు చేపట్టే విధంగా చర్యలు తీసుకోకపోవడం ముఖ్యంగా ఈ వార్డు లోని సమస్యలను పట్టించుకోకపోవడం వెనుక అంతర్యం ఏంటని..? వార్డ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దుర్గామాత నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో విగ్రహాల ర్యాలీ ఈ దారి గుండా వెళుతుంటాయని విగ్రహాలను తీసుకు వెళ్తున్న క్రమంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని దుర్గామాతల మండపాల నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ల పదవీకాలం పూర్తయినప్పటి నుండి 9వ వార్డులో పరిశుభ్రతపై పట్టింపు లేకపోవడం, పరిశుభ్రతపై వార్డ్ ప్రజలు ఇప్పటివరకు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే కల్వర్టు శిథిలావస్థకు చేరినప్పటికీ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ నాయకుల గ్రూపు తగాదాలు కూడా కారణమేమోనని అని వార్డ్ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ మున్సిపల్ సిబ్బంది కల్వర్టు పూర్తిగా కూలిపోక ముందే నూతన కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






