- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో సింగరేణి సీఎస్ఆర్ నిధుల ఆధారంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.

దిశ, మంచిర్యాల: జిల్లాలో సింగరేణి సీఎస్ఆర్ నిధుల ఆధారంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉండకూడదన్నారు.
నీటిపారుదల, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, మున్సిపల్, మిషన్ భగీరథ, రోడ్లు-భవనాలు, పంచాయతీ, టీజీఎంఎస్ఐడీసీ, సింగరేణి (సివిల్) శాఖల అధికారులతో కలిసి మండల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మురుగు కాలువలు, రహదారులు, చెరువుల పూడిక తీయడం, ఓపెన్ జిమ్‌లు, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్ వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, బిల్లులు సకాలంలో సమర్పించాలని సూచించారు.
అనంతరం శాఖల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించడం తో పాటు, కార్యాచరణలో లోపాలుంటే వెంటనే సరి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళికాధికారి పూర్ణచందర్ రావు, సింగరేణి అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






