- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ప్రభుత్వంతోనే రహదారులు అభివృద్ధి
by Sridhar Babu |
బీజేపీ ప్రభుత్వంతోనే అన్ని రహదారులు అభివృద్ధి అవుతున్నాయని అదిలాబాద్ ఎంపీ గొడెం నాగేష్ అన్నారు.

X
దిశ, భైంసా : బీజేపీ ప్రభుత్వంతోనే అన్ని రహదారులు అభివృద్ధి అవుతున్నాయని అదిలాబాద్ ఎంపీ గొడెం నాగేష్ అన్నారు. రూ. 30 కోట్ల నిధులతో నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి భూమి పూజచేసి మాట్లాడారు. రహదారుల నిర్మాణంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. ముధోల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి వాస్తపూర్ గ్రామం వరకు సీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 14 గ్రామాలకు కేంద్రం ద్వారా నిధులు తెచ్చినట్టు చెప్పారు. దశల వారీగా కేంద్రం నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- MP Godem Nagesh
Next Story






