డబ్బా గ్రామ పంచాయతీ సెక్రెటరీ సస్పెండ్

by Yarlagadda Naga Rani |

డబ్బా గ్రామ పంచాయతీ సెక్రెటరీ సస్పెండ్
X

దిశ, చింతలమానేపల్లి: డబ్బా గ్రామ పంచాయతీ సెక్రెటరీ సస్పెండ్ అయ్యారు. ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో గురువారం అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి డబ్బా గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన సందర్భంగా పంచాయితీ సెక్రెటరీ టి. సాయికృష్ణపై వచ్చిన్న పలు ఆరోపణలను పరిశీలించి, ఆయన విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడం, గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి పనుల అమలులో నిర్లక్ష్యం వహించడం కారణం వల్లే సాయికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story