- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్‌పై సవారీ..
గో రక్షణ కోసం మహారాష్ట్రకు చెందిన సంజయ్ కారత్ అనే వ్యక్తి ఏకంగా 15 వేల కిలోమీటర్లు సైకిల్‌పై యాత్ర చేపట్టాడు.

దిశ, మందమర్రి: దైవ భక్తిని చాటుతూ మహారాష్ట్రకు చెందిన సంజయ్ కారత్ అనే వ్యక్తి ఏకంగా 15 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టాడు. సంజయ్ కారత్ దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని 2024 నవంబర్ 1వ తేదీన సైకిల్‌పై బయలుదేరాడు. గుజరాత్, నేపాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 11 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మీదుగా వెళ్తున్నా సాధువు అలసిపోయి పాత బస్టాండ్ వద్ద రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో బస్‌స్టాప్‌లో పడుకున్న సాధువును చూసిన, మర్రి శివ శంకర్ సాధువుతో మాట్లాడి, స్వయంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టాడు. సాధువు ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అలాగే సన్మానంతో సత్కరించి, రోడ్ సేఫ్టీ కోసం సేఫ్టీ జాకెట్ ఇచ్చాడు. మర్రి శివ శంకర్ గతంలో 2022 లో 12 జ్యోతిర్లింగాలను సైకిల్‌పై దర్శనం చేసుకోవడం కోస మెరుపు. కేదార్నాథ్ వెళ్తున్న సంజయ్ కారత్‌కు తన స్వస్థలమైన అహ్మద్‌నగర్‌లోని గోశాల నిర్వహిస్తూ ఉండటం విశేషం. ఇందుకుగాను లోక కల్యాణం, గోవులను కాపాడటం కోసం సైకిల్ యాత్ర చేపట్టినట్టు సంజయ్ కారత్ చెప్పారు.






