సైబ‌ర్ మోసం.. రూ.1.37 ల‌క్ష‌లు స్వాహా..!

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్‌ : రోజు రోజుకు ఆదిలాబాద్ జిల్లాలో సైబర్‌ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అమాయ‌క‌ ప్రజలను నమ్మించి అందిన కాడికి డబ్బు కాజేస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్

సైబ‌ర్ మోసం.. రూ.1.37 ల‌క్ష‌లు స్వాహా..!
X

దిశ, ఆదిలాబాద్‌ : రోజు రోజుకు ఆదిలాబాద్ జిల్లాలో సైబర్‌ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. అమాయ‌క‌ ప్రజలను నమ్మించి అందిన కాడికి డబ్బు కాజేస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్ కు చెందిన జల్వే సతీష్‌ క్రేన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఈ నెల 4న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను ఎల్‌అండ్‌టీ కంపెనీలో పనిచేస్తానని, సగం ధరకే డీజిల్‌ ఇస్తానని నమ్మించాడు. 3150 లీటర్ల డీజిల్‌కు రూ.1,57,500 అవుతుందని చెప్పాడు. పలుసార్లు ఫోన్‌ చేయడంతో బాధితుడు నమ్మాడు. ఫోన్‌ పే ద్వారా రూ.13వేలు పంపించాడు. తన స్నేహితుడి ఫోన్‌ నుంచి రూ.50వేలు, క్రేన్‌ యజమాని ద్వారా రూ.73,500 పంపించాడు. సైబర్‌ నేరగాడు పట్టణంలోని జై జల్‌రాం పెట్రోల్‌ బంక్‌కు వెళ్లీ డీజిల్‌ తీసుకోవాలని సూచించాడు. బాధితుడు అక్కడికి వెళ్లీ అడగ్గా పెట్రోల్‌ బంక్‌ యజమాని అలాంటిదేమి లేదని చెప్పాడు. దీంతో సైబర్‌ నేరగాడికి ఫోన్‌ చేయగా స్విచ్చాప్‌ అని వచ్చింది. తాను మోసపోయినట్లుగా గ్రహించి వన్‌టౌన్‌ ఫోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ సునీల్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story