గాలి వాన బీభత్సం.. నేలకొరిగిన పంటలు

by Jakkula.Mamatha |

కుబీర్ మండలంతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సోమవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది.

గాలి వాన బీభత్సం.. నేలకొరిగిన పంటలు
X

దిశ, కుబీర్: కుబీర్ మండలంతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సోమవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి గాలి దుమారం, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అర్ధరాత్రి వరకు అంధకారం నెలకొంది. ఈ అకాల వర్షానికి చేతికి వచ్చిన జొన్న మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోయాయి. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేలకొరిగిన మొక్కజొన్న పంటను కోయడానికి కూలీల ఖర్చులు తడిసి మోపెడైతాయని రైతులు అంటున్నారు. ఊహించని విధంగా కొద్దిసేపట్లోనే జరిగిన అనుకోని వాతావరణ మార్పులు చూసి రైతులు నిచ్చేస్తులయ్యారు. తీవ్ర నష్టాన్ని మిగిల్చి అప్పుల పాలు చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story