- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అపస్మారక స్థితిలో ఉన్న పిచ్చుకకి సీపీఆర్..!
నిర్మల్ జిల్లా బైంసా మండలం హస్గుల్ గ్రామంలోని శ్యామ్ అనే వ్యక్తి ఇంటి వద్ద స్వేచ్ఛగా సంచరిస్తున్న... CPR for Sparrow

X
దిశ, బైంసా: నిర్మల్ జిల్లా బైంసా మండలం హస్గుల్ గ్రామంలోని శ్యామ్ అనే వ్యక్తి ఇంటి వద్ద స్వేచ్ఛగా సంచరిస్తున్న పిచ్చుక ఇంట్లోకి ధాన్యపు గింజలకై రాగా ఇంట్లో ఉన్న ఫ్యాన్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోయింది. వెంటనే గమనించిన చాయ్ వాలా శ్యామ్ ఆ పిచ్చుకకి ఊపిరాడడం లేదని గుర్తించాడు. ఇటీవల చాలామంది మనుషులు గుండెలాగిపోయి చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గుండె పని చేయడం ఆగిన మనుషులకి డాక్టర్స్, స్వచ్ఛంద సంస్థలు ఇలా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో సి.పి.ఆర్ సిస్టం గురించి ప్రచారం జరుగుతుంది. అట్టి సి.పి.ఆర్ సిస్టం గుర్తుకువచ్చి ఆ పిచ్చుకపై ప్రయోగించాడు శ్యామ్. వెంటనే ఆ పిచ్చుక ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. మెలకువలోకి వచ్చిన పిచ్చుకకి కొంత సమయానికి నీటిని ఇచ్చారు. కోలుకున్న పిచ్చుక నీటిని తాగి సంతోషంగా పైకి ఎగిరిపోయింది.
Next Story






