- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పులి దాడిలో ఆవు మృతి
దిశ,ఇంద్రవెల్లి / సిరికొండ : పెద్ద పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం సాత్ మెరి గ్రామ సమీపంలో కలకలం రేపింది.

దిశ,ఇంద్రవెల్లి / సిరికొండ : పెద్ద పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం సాత్ మెరి గ్రామ సమీపంలో కలకలం రేపింది. స్థానిక గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోనీ సాత్ మోరీ గ్రామానికి చెందిన మెస్రం బొజ్జు కు చెందిన ఆవు ను బుధవారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చేసి హతమార్చినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని పులి అడుగు జాడలను పరిశీలించారు. ముందుగా దర్యాప్తులో చిరుత పులి దాడి చేసిందని నిర్ధారణ చేశారు. అనంతరం సుదీర్ఘంగా పరీక్షలు చేసి చిరుత పులి కాదు.. పెద్ద పులి దాడి చేసిందని నిర్ధారించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి నాగవత్ స్వామి మాట్లాడుతూ గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి అడుగుజాడలు కనబడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలను గమనించేందుకు ప్రత్యేక బృందాలు కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఏస్ఎస్ఓ చంద్రారెడ్డి బీట్ ఆఫీసర్ లు సంతోష్, భీంజి నాయక్, బేస్ క్యాంప్ సిబ్బంది జుగదిరావు, మారుతి ఉన్నారు.






