- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోలులో అవినీతి.. కేసు నమోదు
దిశ, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు లో అవినీతికి పాల్పడిన ఆగ్రో ఇండస్ట్రీస్, వ్యవసాయ అధికారి, విస్తరణాధికారి తోపాటు 8 మంది రైతులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై జైపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు జిల్లా

దిశ, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు లో అవినీతికి పాల్పడిన ఆగ్రో ఇండస్ట్రీస్, వ్యవసాయ అధికారి, విస్తరణాధికారి తోపాటు 8 మంది రైతులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై జైపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, చీఫ్ విజిలెన్స్ అధికారి సి.ఎస్ శశిధర్ రాజు గురువారం జిల్లా కలెక్టరేట్ లో వివరాలు వెల్లడించారు. జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పాటు రామారావు పేట గ్రామం లోని ప్రముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానులు, మండల వ్యవసాయ అధికారి, విస్తరణ అధికారి, 8 మంది రైతులు, ట్రాన్స్ ఫోర్ట్ కాంట్రాక్టర్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జైపూర్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ స్కామ్ లో రూ. 1.39 లక్షలు దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిపారు. జిల్లాలో 740 ఎకరాలలో 6 వెల 322.6 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని 8 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి రూ. 1 కోటి 39 లక్షలు ఆన్లైన్ ప్యాడి ప్రోక్యుర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో తప్పుడు సమాచారం నమోదు చేసి, రవాణా ఖర్చుల కింద రూ. 1.90 లక్షల కింద ట్రాక్ చిట్టీలు సృష్టించారని వివరాలను వెల్లడించారు. జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు..
ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. అవినీతికి పాల్పడిన ఎంతటి వారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళ, ఓ.ఎస్.డి శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అజయ్ బాబు పాల్గొన్నారు.






