బజార్ హత్నూర్ లో కార్డన్ సెర్చ్..44 బైకులు స్వాధీనం

by Ratna Kumari |

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్ర వర్ధన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు

బజార్ హత్నూర్ లో కార్డన్ సెర్చ్..44 బైకులు స్వాధీనం
X

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్ర వర్ధన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు బజార్ హత్నూర్ ఎస్సై సంజయ్ తెలిపారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ లో భాగంగా అనుమానాస్పదంగా 44 బైకులు స్వాధీనం చేసుకొని పరిశీలించగా సరియైన ధృవపత్రాలు లేని బైకులపై కేసు నమోదు చేశామన్నారు. అంతేగాకుండా పెండింగ్ చలాన్ లు 68 కేసులలో సుమారు రూ. 22,000 కట్టించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బోథ్ సిఐ గురుస్వామి, బజార్ హత్నూర్, బోథ్ ఎస్ఐ లు పాల్గొన్నారు.

Next Story