స్కిల్స్ సెంటర్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

by Taduka Kalyani |

నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ అందించేందుకు నిర్మిస్తున్న స్కిల్స్ సెంటర్ భవన నిర్మాణ పనులను వేగవంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.

స్కిల్స్ సెంటర్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
X

దిశ, ఆసిఫాబాద్ : నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ అందించేందుకు నిర్మిస్తున్న స్కిల్స్ సెంటర్ భవన నిర్మాణ పనులను వేగవంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో పాత కలెక్టరేట్ భవనం వెనుక భాగంలో రూ. 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్కిల్స్ సెంటర్ భవన నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ. 70 లక్షల నిధులతో ఈ స్కిల్స్ సెంటర్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్ అందుబాటులోకి రావడం వల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ స్కిల్స్ శిక్షణ అందించి, వారు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పెండింగ్ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి, భవనాన్ని త్వరగా వినియోగంలోకి తీసుకురావాలి ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Next Story