- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
దిశ, ఆదిలాబాద్ : పేదలకు ఉపాధి కల్పించి వారికి అండగా నిలబడేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ

దిశ, ఆదిలాబాద్ : పేదలకు ఉపాధి కల్పించి వారికి అండగా నిలబడేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అన్నారు. టీపీసీసీ, ఏఐసీసీ పిలుపులో భాగంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఖండిస్తూ స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. రహదారిపై బైటాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. 2005 లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారని,గాంధీని అవమానించే రీతిలో ప్రస్తుతం పేరును మార్పు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.దేశ సమగ్రతను కాపాడేందుకు మహాత్ముడు చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ప్రపంచ దేశాలు గాంధీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని..కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉపాధి హామీ చట్టం నీరుగారేలా విధానాలను అమలు చేయడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి,మాజీ ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సంజీవ్ రెడ్డి, నాయకులు గిమ్మ సంతోష్, కలాల శ్రీనివాస్,లోక ప్రవీణ్, శ్రీలేఖ,ప్రేమల,నహిద్, మునిగెల నర్సింగ్ పాల్గొన్నారు.






