- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి పోరులో హస్తం హవా.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో సత్తా చాటిన కాంగ్రెస్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 70 శాతం పైగా పంచాయతీలను కైవసం చేసుకున్నది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ లు ఎన్నికల్లో సత్తా చాటుకున్నాయి.

దిశ, ప్రతినిధి నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 70 శాతం పైగా పంచాయతీలను కైవసం చేసుకున్నది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ లు ఎన్నికల్లో సత్తా చాటుకున్నాయి. పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడ్డారు. ఎన్నికలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులు సీరియస్ గా తీసుకొని ప్రచారం చేశారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తమ పరిధిలో ఉన్న గ్రామపంచాయతీలను గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆశించిన రీతిలోనే అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామపంచాయతీలను కైవసం చేసుకున్నది. అయితే అనేక చోట్ల భారత్ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు కూడా గెలుపొందడం ఆ రెండు పార్టీలకు ఊరటను ఇచ్చింది.
మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు దారుల గెలుపు...
పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత గ్రామపంచాయతీ స్థానాలను పల్లె ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. నిర్మల్ జిల్లాలోని మామడ మండలంలో 23 గ్రామపంచాయతీలకు గాను 17 పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోగా 8 స్థానాల్లో బిజెపి గెలిచింది. లక్ష్మణ చందా మండలంలో 13చోట్ల కాంగ్రెస్ గెలవగా... ఏడు చోట్ల బిజెపి అభ్యర్థులు గెలిచారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఫలితాలు భిన్నంగా వచ్చాయి. పెంబి మండలంలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా... ఖానాపూర్ మండలంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇరువురు పంచుకున్నారు. మంచిర్యాల జిల్లాలో తొలి విడత నిర్వహించిన ఎన్నికలలోలక్షట్ పేట్, దండేపల్లి,హాజీపూర్, జన్నారం మండలాలలో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 40, బీఆర్ఎస్, 10, బీజేపీ 5, ఇతరులు 12 చోట్ల విజయం సాధించారు.
ఏజెన్సీలో మిశ్రమ ఫలితాలు...
ఇదిలా ఉంటే ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఆదివాసి గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న గ్రామపంచాయతీ లలో వారి ప్రభావం బలంగా కనిపించింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మైనారిటీలు అనేక గ్రామపంచాయతీలలో ఈసారి ఆదివాసి అభ్యర్థులకు అండగా నిలిచినట్లు కనిపించింది.






