కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి : ఆదిలాబాద్ ఎంపీ

by Chintha Aamani |

కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి.. 49 జీవోను తెచ్చింది వాళ్లే..నిలుపుదల చేసింది వాళ్లే అని ఎంపీ గొడం నగేష్ హాట్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి : ఆదిలాబాద్ ఎంపీ
X

దిశ, ఆసిఫాబాద్ : కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి.. 49 జీవోను తెచ్చింది వాళ్లే..నిలుపుదల చేసింది వాళ్లే అని ఎంపీ గొడం నగేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు ప్రతిపాదన చేసిన కాంగ్రెస్, స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏక పక్షంగా 49 జీవో అమలు చేసి,కేంద్రం మీద బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పుడు జీవో నిలుపుదల పేరుతో డ్రామా చేస్తోందన్నారు.టైగర్ కన్జర్వేషన్ రిజర్వు ఏర్పాటుతో దాని పరిధిలో ఉన్న 339 గ్రామ ప్రజలు అన్ని విధాలుగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని వేంటనే 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story