బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ డ్రామాలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

by Chintha Aamani |

బీసీ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు అన్నారు.

బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ డ్రామాలు :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
X

దిశ,ఆసిఫాబాద్ : బీసీ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో అప్పుడు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు బీసీలకు 32 శాతం మిగతా 10 శాతం ముస్లింలకు ఇస్తామని ఓబీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

కామారెడ్డి డిక్లరేషన్ లో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ ఈ మాట చెప్పలేదన్నారు. అసలు కాంగ్రెస్ కు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టంలేదని, అందుకే కాలయాపన చేస్తూ రాష్ట్రపతి, ప్రధాన సమయం ఇవ్వడం లేదని చెప్పి,బీజేపీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. అసలు వారికి రాహుల్ గాంధీ సమయం ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెడితే బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు.

Next Story